తీన్మార్ మల్లన్నకు బాల్క సుమన్ వార్నింగ్… ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పు దెబ్బలు తప్పవంటూ…

-

తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పై బాడీ షేమింగ్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. తాజాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ .. తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చెంపదెబ్బలు కాదు.. చెప్పు దెబ్బలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళల్ని, చిన్నపిల్లల్ని అవమానిస్తున్న బీజేపీ నాయకులకు తగిన రీతిలో బుద్ది చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఇష్టం వచ్చినంటూ మాట్లాడుతున్న బీజేపీ నాయకులను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరన్నారు. బీజేపీ నేతలు కబర్థార్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చిరించారు. రాజకీయాలతో సంబంధం లేని చిన్న పిల్లాడిని పట్టుకుని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయడం… బాడీ షేమింగ్ చేయడం ఏం సంస్కారం అని అన్నారు. సీఎం, మంత్రులపై ఇష్టారీతిలో బీజేపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారని .. ఇక పై క్షమించేది లేదని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారని ఒక్క సైగ చేస్తే బీజేపీ నేతలకు ఇబ్బందులు తప్పవని బాల్క సుమన్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version