తీన్మార్ మల్లన్నను బట్టలు ఊడదీసి కొడతాం : జీవన్ రెడ్డి

-

తీన్మార్ మల్లన్నను ఉరికించి కొట్టాలని.. ఆయన జర్నలిస్ట్ కాదు…బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడని నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కెటిఆర్ కుమారుడి గురించి ఇష్టారాజ్యాంగ మాట్లాడుతాడా ? కెటిఆర్ ఫ్యామిలీ మీద మరొక్కసారి మాట్లాడితే మా గులాబీ సైన్యం బట్టలూడదీసి కొడుతుందని హెచ్చరించారు. మా నేత కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా అభిమానులు ఊరుకుంటారా ? అని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బియ్యానికి బిజెపి దయ్యంలా మారిందని.. కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే బిజెపి, కాంగ్రెస్ బూతులకు అంబాసిడర్లుగా మారారని అగ్రహించారు.

తెలంగాణ మంత్రులను రేవంత్ కొజ్జాలంటాడా. ఆయన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో చంద్రబాబుకు బంట్రోతులా మారిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బిజెపికి బంత్రోతులా మారాడని అగ్రహించారు. తెలంగాణ రైతులపై కేంద్రానికి..పీయూష్ గోయల్ కు కనికరం లేదని.. పీయూష్ గోయల్ అన్ని తప్పుడు లెక్కలు చెప్పాడని మండిపడ్డారు. హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి కొజ్జాతనం తెలిసిందని.. గాజులు చీరలు అని మహిళలను అవమాన పరుస్తాడా ? అని నిలదీశారు. 2023 లో బిజెపికి డిపాజిట్లు రావని.. పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రచ్చ బండ కార్యక్రమం ఉరి బండగా మారుతుందని.. తెలంగాణపట్ల వ్యతిరేకత కాంగ్రెస్, బిజెపి డి ఎన్ ఏ లోనే ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version