తమిళనాడులో అసెంబ్లీలో ఐపిఎల్ పై గొడవ చోటు చేసుకుంది. తమిళనాడు ఆటగాడు ఒక్కడు కూడా చెన్నై సూపర్ కింగ్స్ లేడంటూ పిఎంకే ఆందోళనకు దిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం రద్దు చేయాలని పిఎంకే డిమాండ్ చేసింది.
క్రీడాశాఖ దీనిపై స్పందించాలని…పిఎంకే కోరింది. క్రికెట్ పేరుతో చెన్నై టీం యాజమాన్యం వ్యాపారం చేస్తోందని పిఎంకే ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఎలాగైనా.. చెన్నై సూపర్ కింగ్స్ టీం రద్దు చేయాలని పిఎంకే డిమాండ్ చేసింది. ఇక దీనిపై స్టాలిన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోలేదు. కాగా..ఐపీఎల్ 2023 లో భాగంగా… ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ రాజస్తాన్ వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..గెలిచే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి.