ముఖ్యమంత్రికి మూడింది అందుకే : బండి సంజయ్‌

-

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అన్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసి దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిర్వాసితులపై దాడి చేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులపై టీఆర్ఎస్ సర్కారు కక్షగట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి ఇబ్బందులు కు గురి చేస్తుందని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని, అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన ధ్వజమెత్తారు.

నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జి దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాము అని చెప్పడం వాళ్లు ఒప్పుకోకపోవడంతో అర్థ రాత్రి వందలాది మంది పిల్లలు చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా విచక్షణ రహితంగా కొట్టారని దుయ్యబట్టారు. బాధలు వినమని సీఎం ను కోరామని, మా తాత ముత్తాత ఆస్తి సెంటిమెంట్ పక్కన పెట్టీ సహకరిస్తామని చెప్పిన దానికి తగినట్లు ఆదుకోమని అడిగితే వారి బాధలు వినకుండా దాడులు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పోలీసులు కలిసి దాడి చేశారని, ఈ ఘటనపై సీఎం స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందించక పోవడానికి అంత పీకుడు పని ఏముందంటూ ఆయన ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version