సోషల్ మీడియా ‘వేదిక’గా సంప్రదాయ కట్టులో..ఈ సుందరి సాలిడ్ అందాల ఆరబోత..

-

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న ముంబై భామ వేదిక కుమార్..హీరోయిన్ గా దూసుకుపోతున్నది. ‘విజయ దశమి’ పిక్చర్ తో తెలుగు చిత్ర సీమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

సోషల్ మీడియా వేదికగా ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పేరుకు తగ్గట్లుగా ఈ సుందరి..సోషల్ మీడియానే తన ప్రమోషనల్ ‘వేదిక’గా మార్చుకుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తో పాటు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ సుందరి..గులాబీ రంగు లంగావోణీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో హీరోయిన్ అందాలు చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. సంప్రదాయానికి ప్రతీక అయిన వస్త్రాల్లోనూ ఈ భామ అందాల ఆరబోస్తుందని అంటున్నారు.

అలా కురులు సరి చేసుకుంటున్నట్లు, నాభి, నడుము అందాలు క్లియర్ గా చూపిస్తూ..క్వీన్ లాగా మెరుస్తోంది వేదిక. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈ సుందరి..టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలో కనిపించింది. ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ‘జంగల్’ అనే తెలుగు చిత్రంతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది ఈ హీరోయిన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version