బీజేపీ మెగా ర్యాలీ.. ముఖ్య అతిధిగా స్మ్రుతి ఇరానీ..

-

తెలంగాణ బీజేపీ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభతో తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను ముగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తొలివిడత సక్సెస్ కావడంతో ముగింపు సభ కూడా గ్రాండ్ గా ఉండాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంది. లక్షదాకా జనాన్ని సమీకరించేందుకు ప్రణాళిక రచించింది. అందుకోసం ఇటీవల బండి సంజయ్ అన్ని జిల్లాల అధ్యక్షలతో మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేజీ ముఖ్య

నేత స్మ్రుతి ఇరానీ హజరుకానున్నారు. తొలి విడత యాత్రలో బండి సంజయ్ 8 జిల్లాల గుండా 400 కిలోమీటర్లకు పైగా సాగింది. రెండో విడత యాత్ర నవంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ యాత్ర చేపట్టినప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శలు,ప్రతి విమర్శలు జరిగాయి. ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ పలు లేఖాస్త్రాలను సంధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version