బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ మధ్య రసవత్తర రాజకీయం కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తూ టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్నారు. తెలంగాణలో వివిధ వర్గాల సమస్యలను లేఖల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తున్నారు. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖలు సంధించారు. తాజాగా సీఎం కేసీఆర్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. దీనిలో ఎన్ని అమలు చేశారు..? హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పడు ఇస్తారని ప్రశ్నించారు. బండి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య
విమర్శప్రతివిమర్శలు పెలుతున్నాయి. మరోవైపు హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో రెండు పార్టీల విమర్శలు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయో చూడాలి.