గత వారం రోజుల నుండి తెలంగాణ బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. పార్టీలో చేరిన ఈటల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారన్న వార్తలతో రాష్ట్రము అంతటా అట్టుడికింది. అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని స్వయంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశాడు, మరియు ఈటల రాజేందర్ హత్యకు కుట్రజరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ… ఈటల రాజేందర్ కు నిజంగా థ్రెట్ ఉంటే ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాడు. ఇక బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ… దీనిపై పూర్తి నిర్ణయం జెడ్పీ నడ్డా దే అని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఇది కేవలం గాలి వార్త అని తెలియచేశారు.
బండి సంజయ్: BRS నాపై కుట్ర చేస్తోంది ..
-