తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో నేతల ఓవర్ ఫ్లో అయ్యారు..ఎడాపెడా ఇతర పార్టీల నుంచి నాయకులని చేర్చుకోవడంతో ప్రతి నియోజకవర్గంలో సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే పరిస్తితి కనిపిస్తుంది. దీని వల్ల అంతర్గత పోరు ఎక్కువైంది. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మంచి మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ నుంచి 12, టిడిపి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలని తీసుకున్నారు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిన చోట…బిఆర్‌ఎస్ లో పోటీచేసి ఓడిన నేతలకు ఇబ్బందులు వచ్చాయి. ఇలా అంతర్గత పోరు మొదలైంది. ఈ క్రమంలోనే మహేశ్వరం నియోజకవర్గంలో రచ్చ పెరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలిచి..బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. అలాగే మంత్రి కూడా అయ్యారు. ఇక బిఆర్‌ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
2014లో తీగల టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు..2018లో పోటీ చేసి ఓడిపోయారు. సబితా కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో సబితా, తీగల వర్గాలకు పడటం లేదు. అయితే మంత్రిగా ఉన్న సబితాకే మహేశ్వరంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మళ్ళీ ఆమెకే సీటు ఖాయమైంది. దీంతో తీగలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నెక్స్ట్ తనకు సీటు ఇవ్వకపోతే పార్టీ మారిపోవడం గ్యారెంటీ అని తీగ ప్రకటన చేశారు.
అయితే గ్యారెంటీగా సీటు సబితాకే రావడం ఖాయమని తెలుస్తుంది. అప్పుడు తీగల పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేక బిజేపిలోకి వెళ్తారా? అనేది క్లారిటీ రాలేదు. అయితే మహేశ్వరంలో బిజేపి కంటే కాంగ్రెస్‌కు బలం ఎక్కువ. దీంతో ఆయన కాంగ్రెస్ వైపే వెళ్ళే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ లోకి వెళితే..సబితాకు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి తీగలతో సబితాకు రిస్క్ ఎక్కువే అని చెప్పవచ్చు.