సీఎం ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు : బండి సంజయ్‌

-

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు.. అటు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై లిక్కర్‌ స్కాం ఆరోపణలు తెలంగాణ హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే.. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్. వచ్చే శుక్రవారం నాడు హైదరాబాద్లో ఘర్షణలు సృష్టించేందుకు కేసీఆరే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. కరీంనగర్లో ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు బండి సంజయ్. పాదయాత్రను అడ్డుకుని, టీఆర్ఎస్ గూండాలతో దాడి చేయించారని మండిపడ్డారు బండి సంజయ్.

ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. సీఎం ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు బండి సంజయ్. సీఎం కేసీఆర్కు ఈడీ భయం పట్టుకుందని, ప్రజా సంగ్రామ యత్ర పై ప్రజల్లో చర్చ జరుగుతుందని..27న బీజేపీ తలపెట్టిన సభను సీఎం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్, హైదరాబాద్ లలో కార్యకర్తలు కష్టపడితేనే గెలిచామని.. మునుగోడులో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version