కేసీఆర్‌కు పాకిస్థాన్‌ వాళ్లతో సంబంధాలు..దుబాయ్‌, సింగపూర్‌లో ఇళ్లు ఉంది : బండి సంజయ్‌

-

సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు… కేసీఆర్ కి దుబాయ్ లో ఇల్లు ఉంది, సింగపూర్ లో ఇల్లు ఉందని… కేసీఆర్ జైల్ మెట్స్ ని కలుస్తున్నాడని పేర్కొన్నారు. పీకే సర్వే లోనే బీజేపీ 64 సీట్లు గెలిస్తుందని 3 నెలల క్రితమే వచ్చిందని.. హైద్రాబాద్ లో అభివృద్ధి ఎవరి నిధులతో జరుగుతుందని నిలదీశారు..

చైనా రాజ్యాంగం కావాలి అంట… చైనా అధ్యక్షుడు లా బతికున్నన్ని రోజులు ఆయనే సీఎం గా ఉండాలని అని అనుకుంటున్నాడని కేసీఆర్ పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ పైన విచారణ ప్రారంభం అయిందని.. కేంద్రాన్ని తిట్టి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందా… బైంసా లో ఏమి జరిగింది తెలియదా కేసీఆర్ అని నిలదీశారు. హిందువుల ఇల్లు తగల పెట్టారు… cmo ఆదేశాలతో హిందు యువకుల పై పిడి ఆక్ట్ పెట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version