ఒవైసీ అనుమతి కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారా? : బండి సంజయ్‌

-

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఓ పబ్‌ నుంచి మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే సదరు బాలికను కొంతమంది గుర్తు తెలియని యువకులు కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెల్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాలికకు గాయాలవడంతో మళ్లీ పబ్ దగ్గర విడిచిపెట్టడంతో.. బాధిత బాలిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ దారుణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

ఇందులో అధికార పార్టీ మిత్రపక్షానికి చెందిన నేత బంధువు కూడా ఉన్నట్టు తెలుస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆ దుండగులపై చర్యలు తీసుకునేందుకు ఒవైసీ అనుమతి కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారా? అని ప్రశ్నించారు బండి సంజయ్‌. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదన్న విషయం తాజా ఘటనతో వెల్లడైందని, చెప్పుకుంటే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. నిందితులను సరిగా గుర్తించలేని విధంగా ఉన్న సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఏంటి? అని బండి సంజయ్‌ నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version