కేసీఆర్ క్ష‌మాప‌ణ చెప్పాలి : బండి సంజ‌య్

-

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ మేడారం జాత‌ర‌లో శ‌నివారం పాల్గొన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్, ఎస్పీ గైర్హాజ‌ర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవ‌మాన‌మా..? గ‌వ‌ర్న‌ర్‌కు ఇచ్చే మ‌ర్యాద ఇదేనా, మ‌హిళ అని చూడకుండా అవ‌మానిస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగం ఇదేనా..? కోట్లాది మంది ప్ర‌జ‌లు సంద‌ర్శించే మేడారం జాత‌ర‌కు వెళ్ల‌కుండా గిరిజ‌నుల‌ను సీఎం అవ‌మానించార‌ని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ‌మే కేసీఆర్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు బండి సంజ‌య్‌. ప్రోటోకాల్ పాటించ‌ని అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.

గ‌వ‌ర్న‌ర్ మేడారం మ‌హా జాత‌ర‌కు వ‌స్తే క‌నీసం రిసీవ్ చేసుకోవ‌డానికి మంత్రులు రాక‌పోవ‌డంతో వివాదం మొద‌లైంది. అప్ప‌టివ‌ర‌కు అక్క‌డే ఉన్న మంత్రులు గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చే స‌మ‌యానికి అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ని పేర్కొంటున్నారు. హెలికాప్ట‌ర్ లో కాకుండా వ‌రంగ‌ల్ మీదుగా రోడ్డు మార్గానా ములుగు జిల్లాకు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి ములుగు ఎమ్మెల్యే సీత‌క్క స్వాగ‌తం ప‌లికారు. మంత్రులు లేక‌పోవ‌డంతో ప్రోటోకాల్ వార్‌ కొన‌సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version