బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. రష్యా- ఉక్రెయిన్ పరిణామాల మధ్య బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్దవాతావరణం కారణంగా బంగారం రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 46,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి 50,190కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. మరోవైపు సిల్వర్ రేట్లు పెరిగాయి. కేజీకి రూ. 1,400 పెరిగి రూ. 70,000చు చేరింది.
ఉక్రెయిన్- రష్యా క్రైసిస్ వల్ల బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుగుతన్నాయి. నిన్న ఒక్క రోజు తప్పితే.. అంతకుముందు రెండు రోజులు వరసగా.. బంగారం ధరలు తగ్గాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. ఈ ధరలు మరింతగా తగ్గితే.. పసిడి ప్రియులకు కాస్త ఊరట కలుగుతుంది.