తెలంగాణకు కేంద్రం శుభవార్త..సీఎమ్మార్ గడువు పొడిగింపు

-

సీఎమ్మార్ పొడిగింపు కు కేంద్రం సానుకూలంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ వినతితో సీఎమ్మార్ గడువునున నెలపాటు పొడిగించింది కేంద్రం. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని… ప్రధాని మోదీకి పేరొస్తుందనే అక్కసుతోనే బియ్యం పంపిణీ నిలిపేశారని మండిపడ్డారు. రాజకీయాలను పక్కనపెట్టి పేదలను ఆదుకునేందుకు బియ్యం పంపిణీ చేయాలని కోరిన సంజయ్.. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణను పొడిగించే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సాసుకూలంగా స్పందించింది.

ఈరోజు బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి సీఎమ్మార్ సేకరణను నెల రోజులపాటుట కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద దేశవ్యాప్తంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు… ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణను నిలిపేసింది.

దీంతో రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీని ప్రభావం ధాన్యం సేకరణపై పడిందని నిప్పులు చెరిగారు. దీంతో లబోదిబోమన్న రైస్ మిల్లర్లు ఇటీవల బండి సంజయ్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటూ వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ఆహార, పంపిణీ శాఖ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ ను కలిసి మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్న మంత్రి పీయూష్ గోయల్ సమస్య పరిష్కారంపై ద్రుష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి సూచన మేరకు అధికారులను కలిసిన బండి సంజయ్ కుమార్ దాదాపు 2 గంటలపాటు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్న బండి సంజయ్ చేసిన వినతి మేరకు సీఎమ్మార్ సేకరణను మరో నెలపాటు పొడిగించే విషయంపై సానుకూలంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version