సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తక్షణమే వేతన సవరణ సంఘం (PRC) ని ఏర్పాటు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1, 2023 నుండి పెరిగిన జీతాలు చెల్లించాలని వారి కనీస హక్కులను పరిరక్షించాలని కోరుతూ లేఖలో ప్రస్తావించారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త పిఆర్సి అమల్లోకి రావాల్సి ఉందని, కానీ ఇప్పటివరకు కనీసం పిఆర్సి కమీషన్ ను నియమించకపోవడం అన్యాయం అన్నారు. ఇది ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమేనని మండిపడ్డారు బండి సంజయ్. 370 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను చిన్నభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డిఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.