ఈనెల 28నుండి బండి సంజయ్ పాదయాత్ర..!

-

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలు ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో ఈ నెల 24 వరకు బిజెపి జాతీయ నాయకత్వం సంతాపం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ప్రారంభం కావాల్సిన బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

దాంతో రాష్ట్రంలో బిజెపి నాయకులతో సమావేశం అనంతరం ఈనెల 28 నుండి పాదయాత్ర చేయాలని సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం నుండి ఈ నెల 28న ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. హుజూరబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు రాష్ట్రంలోని పలువురు కీలక నాయకులు కూడా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version