బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే… గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు.
రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా.. పిల్లలు, వ్రుద్దులకు రాళ్ల తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదా తెలియదా అని అడిగారు. అలాగే బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి తక్షణమే ఈ దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు బండి సంజయ్.