పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరిగిందన్నట్లుంది : బండి సంజయ్‌

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి… రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కోరారు. ‘‘కాంగ్రెస్ ను గెలిపించారు… టీఆర్ఎస్ ను ఆదరించారు… బీజీపీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వండి’’ అంటూ కోరారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి, ప్రజల్లో భరోసా నింపడానికే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు.

పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరిగిందన్నట్లు… కేసీఆర్ కు అధికారం కట్టబడితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేసీఆర్ ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి శ్రీలంకకు పట్టిన గతే పడుతుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్న సంజయ్… కేబినెట్ లోని ప్రధాన పోస్టులన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్నారు. డ్రగ్స్ మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా… ఇలా ప్రతి రంగంలో రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డగా మార్చారని ఆరోపించారు. నిజాం రాజులు, ఔరంగజేబ్ వారసులకు మోకరిల్లే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక ఎంత మాత్రం పాలించే హక్కు లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version