రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

-

ఈశాన్య రాష్ట్రాల లో బీజేపీ హవా కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. నాగాలాండ్ , త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. మేఘాలయలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధిని చూసి మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టడం, జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీని బల పర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయోధ్య నుండి ఆగర్తల వరకు నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు.

గతంలో కాషాయ జెండా పడితే దాడులు జరిగేవని, ఇవాళ కాషాయ జెండా దమ్ము చూపిందన్నారు. బీజేపీకి ఈశాన్య రాష్ట్రాలు అండగా నిలిచాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కషాయం జండను పట్టుకొని తిరగలేని స్థాయి నుండి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసే స్థాయిలో ప్రధాన మంత్రి మోడీ హవా కొనసాగుతుందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, దేశంలో ఎక్కుడ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయ కేతనం ఎగరేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీదే అని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికలపై దేశం మొత్తం తెలంగాణ వైపుకు చూస్తుందని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version