రిచి గాడి పెళ్ళి రివ్యూ.. అదిరిపోయిందిగా

-

తమిళ దర్శకనిర్మాత కె.ఎస్.హేమరాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ రూపొందించిన సినిమా ‘రిచి గాడి పెళ్లి’. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగానే ఇది గత ఏడాది వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రం ‘ట్వల్త్ మ్యాన్’ కు రీమేక్ అంటూ నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే కోర్ పాయింట్ ను మాత్రమే ఆ సినిమా నుండి డైరెక్టర్ తీసుకున్నాడు తప్పితే, దీనికి ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.


కథనం మరియు విశ్లేషణ

మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ “రిచి గాడి పెళ్లి”. ఫ్రెండ్స్, కుటుంబాల నేపధ్యం మధ్య ఫోన్ లో సరదాగా సాగే “గేమ్ కాన్సెప్ట్” మూవీ ఇది. ఆ సరదా గేమ్ వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. సినిమా ఓపినింగ్ సీన్ లోనే సినిమాటోగ్రాఫర్ తన దైన మార్క్ ని చూపించాడు. “రిచి గాడి పెళ్లి” కోసం ఎవ్వరి వాళ్ళ బిజీ లైఫ్ ని వదిలి రిచి ఫ్రెండ్స్ అందరు ‘ఊటీ’ కి బయలు దేరుతారు. అసలు కథ ఇక్కడే మొదలవ్వుతుంది, లక్ష్మీపతి(సతీష్) సరదాగా సాగే ఒక “గేమ్ కాన్సెప్ట్” లోకి రిచి ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎవ్వరికైతే కాల్ వస్తుందో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. అలా టీమ్ లో కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వెనక ఏదొక సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా లవబుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేసాడు డైరెక్టర్ హేమరాజ్. ముఖ్యంగా, నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ లా బ్యాగ్రౌండ్ స్టోరీస్ ని ప్రేక్షకులు బాగా ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో, అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అనే పాటకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

తెర మీద బన్నీ వాక్స్ & చందన రాజ్ కి సరైన స్క్రీన్ స్పెస్ ఇవ్వకపోవడం. అలాగే, కథ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటె బాగుండేది. పలు ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రాఫర్ గా ఈ సినిమాకి అసెట్. ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కచడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఓవరాల్ గా థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు చూడదగిన సినిమా. నటి నటులు పెర్ఫామెన్స్: సత్య ఎస్ కె తన దైన శైలిలో లవర్ బాయ్ లా యాక్ట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా, స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఒక బాలీవూడ్ స్టార్ ని చూసినట్టు ఫీల్ కలుగుతుంది. ప్రణీత పట్నాయక్ క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉండటంతో పాటు పెర్ఫామెన్స్ అదరకొట్టింది. బన్నీ వాక్స్ రియల్ లైఫ్ లో ఒక యూట్యూబ్ స్టార్. సినిమాలో చాలా హోమ్లీ గా నటిస్తూనే కి రోల్ పోషించింది. నవీన్ నేని ఏ పాత్రలో నైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. తన పెర్ఫామెన్స్ తో సినిమాకి ఒక బ్యూటీ ని తీసుకొచ్చాడు. లక్ష్మీపతి (సతీష్) గా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు బాగా రాణించారు.

ప్లస్ పాయింట్స్

నటీనటుల సహజ నటన
ఎంచుకున్న పాయింట్
విజయ్ ఉగలనాథ్ సినిమాటోగ్రఫీ
మ్యూజిక్

బాటమ్ లైన్ : ఫీల్ గుడ్ ఎమోషనల్ – ‘రిచి గాడి పెళ్లి’

రేటింగ్: 3.25/5

Read more RELATED
Recommended to you

Exit mobile version