బండి ల్యాగ్ వద్దు..యూజ్ లేదు!

-

కేసీఆర్ లెక్కలేని అవినీతి కార్యక్రమాలు చేశారు… త్వరలోనే ఆయన్ని జైలుకు పంపుతాం…ఇదే చాలా రోజుల నుంచి బీజేపీ నేతల చెబుతున్న మాటలు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడు మీడియా సమావేశం పెట్టిన సరే..ఈ మాట అనకుండా ఉండరు. కేసీఆర్ జైలుకే అంటూ పదే పదే మాట్లాడతారు. తాజాగా కూడా అలాగే మాట్లాడారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే ముందు బీజేపీ నేతలు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, అప్పుడు కేసీఆర్ వారికి కౌంటర్లు ఇచ్చేవారు. కానీ తాజాగా మాత్రం కేసీఆర్ బడ్జెట్ సమావేశాలపై మీడియా మీటింగ్ పెట్టి, బీజేపీని చెడామడా తిట్టేశారు. ఇక అలా తిట్టాక బీజేపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు. బండి సంజయ్ కూడా మీడియా సమావేశం పెట్టి…కేసీఆర్‌ని తిట్టారు.

దేశంలోనే కేసీఆర్ పెద్ద అవినీతి పరుడని.. జైలుకు పోవడం ఖాయమని, అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తెలంగాణ సమాజం అంతా ఆయన పట్ల కసితో ఉందని, జైలుకు పోతే చప్పట్లు కొట్టే రోజులు రాబోతున్నాయని బండి అన్నారు. సరే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు…కానీ చేసిన విమర్శలే పదే పదే చేస్తే బాగా ల్యాగ్ అయిపోతుంది..ప్రజలు కూడా ఆ విమర్శలని పట్టించుకోరు.

kcr

కేసీఆర్ అవినీతి పరుడు జైలుకు వెళ్తారని ఎప్పుడు బండి ఎప్పుడు మాట్లాడుతున్నారు..కానీ కేసీఆర్ చేసిన అవినీతి ఏంటో, ఆయన జైలుకు ఎప్పుడు వెళ్తారో చెప్పరు. ఓ వైపు తాము అవినీతి పాలన అందిస్తున్నామని కేసీఆర్ అంటారు. అందుకే ప్రజలు తమకు పట్టం కడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ జైలుకు వెళ్తారని పదే పదే చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు..ఒకవేళ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే..త్వరగా వాటిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది…అలా కాకుండా ఇలా జైలుకు వెళ్తారని మాట్లాడటం వల్ల బీజేపీకి రాజకీయంగా పావలా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇకనైనా బండి తన వర్షన్ మార్చి రాజకీయం చేస్తే బెటర్ ఏమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version