మసీదులు తవ్వడానికా బండి సంజయ్ ఎంపీగా గెలిచింది: మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ మసీదులు తవ్వుదామంటున్నారు.. మసీదులు తవ్వడానికేనా నిన్ను ఎంపీ గెలిపించింది అని ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ కి విధ్వంసం మీద తప్ప నిర్మాణం పై శ్రద్ధ లేదని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఇదేనా మనం నేర్పించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమతం పట్ల సహనంతో ఉండండి.. ఎవరి మతాన్ని వారు ఆచరించనివ్వండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడమే కాదు బ్రహ్మాండంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా కట్టి చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పర మతాలను కూడా గౌరవించే వాడే నిజమైన నాయకుడు అని అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version