ఉపాధ్యాయ సంఘాలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీరు, బిర్యానీలకు ఆశపడే వాళ్లంటూ ఆగ్రహించారు. 317 జీఓ పై ఇవాళ బండి సంజయ్ మాట్లాడారు. 317 జీఓ అనాలోచితం, అశాస్త్రీయమని…ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన జీఓ అని ఆగ్రహించారు.
13 జిల్లాలలో స్పౌజ్ బదిలీలు ఎందుకు బ్లాక్ చేశారని.. డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చేయలేదా…అని నిలదీశారు. బదిలీలు, ప్రమోషన్ లు అయిన సరిగా చేయండి…నాలుగు DA లు ఇవ్వాలి… హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదని ఆగ్రహించారు బండి సంజయ్.
కెసిఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు నీకు వత్తాసు పలికే, బీరు బిర్యానీ లకు ఆశపడే వారికి కాకుండా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తో సమావేశాలు పెట్టాలన్నారు. సీఎం కెసిఆర్ మూర్ఖుడు… చెండాలుడని నిప్పులు చెరిగారు.