రాజమౌళికి ధైర్యం చెప్పిన బండ్ల..!

-

లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో సినీ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి’ అని సూచించారు. కాగా, బండ్ల గణేశ్ కూడా కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ సూచనలు చేశారు. అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version