బస్సులో ఫుట్ బోర్డింగ్ చేస్తున్న క్రమంలో చేయొద్దని చెప్పినందుకు ఓ యువకుడు కండక్టర్‌ను కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం వెలుగుచూసింది. కండక్టర్‌ను కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు బస్సులో ఉన్న తోటి ప్రయాణికులను బెదిరించి, భయాందోళనకు గురిచేశాడు.అంతేకాకుండా బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. అనంతరం అతన్ని ప్రయాణికులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే విచారణలో పోలీసులకు నిందితుడు చెప్పిన విషయాలు వెలుగులోకి రాగా అంతా షాక్ కు గురవుతున్నారు. జాబ్ పోయిందన్నకోపంతో పాటు ఒకటి రెండు సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇంకోక జాబ్ రాలేదన్న కోపంతోనే జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో కండక్టర్‌ను కత్తితో పొడిచానని యువకుడు బదులిచ్చాడు. జార్ఖండ్ వాసి హర్ష సిన్హా రెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు. 20 రోజుల కిందట అతని జాబ్ పోయింది.ఉద్యోగం రావడం లేని ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. ఇదే టైంలో ఫుట్ బోర్డింగ్ చేస్తున్న అతన్ని కండక్టర్ మందలించడంతో ఉక్రోషం ఆపుకోలేక కత్తితో 5-6 సార్లు అతన్ని పొడిచినట్లు చెప్పాడు. జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు.