TS : ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు

-

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షసూచన చేసింది. రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. అంతేకాకుండా పలు జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్‌ జారీ చేసింది. వాతావరణ శాఖ పేర్కొన్నట్లుగా శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణ పేట, జొగులాంబ గద్వాల, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, మెదక్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో భారీ ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక శనివారం రోజున భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, మేడ్చల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ముందస్తు సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version