బండి మాటలు వద్దు..చేతలే ముద్దు!

-

మళ్ళీ అవే మాటలు…అవే విమర్శలు కొత్తదనం ఏ మాత్రం లేదు…పైగా మాటల తప్ప చేతలు లేవు…తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసే కార్యక్రమం ఇదే..గత కొంతకాలంగా సంజయ్ ఇలాగే ముందుకెళుతున్నారు. సరే రాజకీయంగా విమర్శలు చేయడమనేది నిత్యం జరిగే ప్రక్రియే… ఏ నాయకుడైన అలాగే చేయాలి..కాకపోతే విమర్శలతో పాటు చేతల్లో కూడా రాజకీయం ఉండాలి..కానీ బండి దగ్గర అది కనిపించడం లేదు. ఏదో ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారో తప్ప…చేతల్లో మాత్రం అది చూపించడం లేదు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఇప్పటివరకు రాజకీయంగా కేసీఆర్ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు..అసలు కేసీఆర్ అవినీతి చేశారని, ఆయనని త్వరలోనే జైలుకు పంపుతామని చెప్పి నానా హడావిడి చేస్తున్నారు..ఎంతసేపు కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని చెబుతున్నారు గాని, ఆ అవినీతి ఏంటి అనేది బయటపెట్టడం లేదు..అలాగే జైలుకు పంపిస్తామని హడావిడి చేస్తున్నారు గాని, అంతకుమించి మరొక స్టెప్ ముందుకెళ్లడం లేదు..తాజాగా కూడా రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామని, వారిని వారిని జైలుకు పంపిస్తామని మాట్లాడారు.

అలాగే గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో తమకు ఓటు శాతం గణనీయంగా పెరుగుతోందని, దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అసలు హైదరాబాద్‌లో బీజేపీకి 60 శాతానికి ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పని అయిపోయిందని, నెక్స్ట్ టీఆర్ఎస్‌ని ఓడించి అధికారంలోకి వస్తామని అంటున్నారు. అయితే ఇలా మాటలు మాట్లాడటం కంటే చేతల్లో దిగి బీజేపీని బలోపేతం చేస్తే బెటర్ అని చెప్పొచ్చు..ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ బలం అనుకున్నంత పెరగలేదు…ఇంకా చెప్పాలంటే బీజేపీ కంటే కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉంది. అలాంటప్పుడు బీజేపీ ఇంకెంత కష్టపడాలో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఇకనైనా మాటలు ఆపి చేతల్లో దిగితే బెటర్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version