అక్టోబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు ఇవే…!

-

రెండు, నాలుగో శనివారం కాకుండా ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు. వీటితో నెలలో అదనపు సెలవులు కూడా ఉంటాయి. అక్టోబర్ నెలలో బ్యాంక్ లకు వచ్చే సెలవు రోజులను ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ సెలవు రోజులు ముందుగానే తెలిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండొచ్చని ఆర్బీఐ భావించింది. దీనికి అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. బ్యాంకులు పనిచేయని రోజులేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

bank

అక్టోబర్ నెలలో మొత్తంగా 14 రోజులు బ్యాంకులకు సెలవును ప్రకటించింది. అక్టోబర్ 2 (శుక్రవారం)-గాంధీ జయంతి, అక్టోబర్ 4 (ఆదివారం), అక్టోబర్ 8 (గురువారం)- చెల్లమ్ రీజనల్ హాలిడే, అక్టోబర్ 10 (రెండో శనివారం), అక్టోబర్ 11(ఆదివారం), అక్టోబర్ 17 (శనివారం)-కత్తి బిహు, అస్సాం, అక్టోబర్ 18 (ఆదివారం), అక్టోబర్ 23 (శుక్రవారం)-మహా సప్తమి, అక్టోబర్ 24 (శనివారం)-మహా సప్తమి, అక్టోబర్ 25 (ఆదివారం), అక్టోబర్ 26 (సోమవారం)-విజయదశమి, అక్టోబర్ 29 (గురువారం)-మిలద్ ఇ షరిఫ్, అక్టోబర్ 30 (శుక్రవారం)-ఈద్ ఇ మిలద్, అక్టోబర్ 31 (శనివారం)-మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి. ఈ రోజుల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవులను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version