బ్యాంకింగ్ రంగంలో ఉన్న పలు కోర్సులు

-

 

 

దేశ ఆర్థిక వ్యవస్థ లో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది .ఇటువంటి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలను, ఆర్థికపరమైన సూత్రాలను అర్థం చేసుకునేవారికి ఈ రంగంలో ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయి. కేవలం కామర్స్ నుంచే కాకుండా సైన్స్, ఆర్ట్స్ ల విద్యార్థులు కూడా గత కొద్ది కాలంగా బ్యాంకింగ్ రంగం ఉన్న ఆసక్తి తో ఈ రంగంలో స్థిరపడుతున్నారు.

బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పలు పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.బ్యాంకింగ్ లో  పీజీ డిప్లొమా చేయాలనుకునే వారు పీజీ డిప్లొమా ( బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) , పీజీ డిప్లొమా (రిటైల్ బ్యాంకింగ్), పీజీ డిప్లొమా (బ్యాంకింగ్ ఆపరేషన్స్), పీజీ డిప్లొమా ( బ్యాంకింగ్) కోర్సులు ఉన్నాయి. వీటి కాల వ్యవధి రెండు సంవత్సరాల నుంచి ఆరు నెలలు వరకు ఉన్నాయి.
ఇంక మాస్టర్స్ విషయానికి వస్తే ఎంబీఏ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), ఎంకాం (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ), మాస్టర్స్ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఇన్సూరెన్స్ లాంటి కోర్సులు రెండేళ్ల వ్యవధితో ఉన్నాయి.
వీటితో పాటుగా మూడు నెలలు వ్యవధి తో ఉన్న  ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ కమర్షియల్ బ్యాంకింగ్ , అడ్వాన్స్ సెర్టిఫికెట్ బ్యాంకింగ్ లాస్ అండ్ మనేజ్మెంట్ లాంటి   కోర్సులు ఉన్నాయి.
ఇకపోతే బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే స్థిరపడిన వారు ఈ రంగంలో తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే చార్టర్ ఫైనాన్స్ అనలిస్ట్ , సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ , సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ మరియు చార్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ లాంటి వృత్తి పరమైన కోర్సులు ఉన్నాయి.
 ఈ రంగంలోకి రావలనుకునే వారికి బ్యాంకింగ్ కోర్సులు చేయడం ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version