UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

-

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు టెక్నాలజీని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. నిత్యం వేలాది మంది ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. లక్షల డబ్బు కోల్పోతున్నారు. అయితే ఈ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మొదటి ట్రాన్సాక్షన్​ కంప్లీట్ కావడానికి.. నిర్దిష్ట సమయం పట్టేలా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల మొదటిసారి పంపే డబ్బు.. అవతలి వ్యక్తికి చేరడానికి చాలా సమయం పట్టనుంది. ఇలా అయితే పొరపాటు ట్రాన్సాక్షన్ జరిగినా.. ఏదైనా మోసం జరిగినా.. ఆ డబ్బును అవతలి వ్యక్తి ఖాతాకు చేరకుండా ఆపొచ్చన్నది కేంద్ర సర్కార్ ఉద్దేశం. ఇలాంటి ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉండేలా చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే చాలా వరకు డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version