కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల డియర్ అలోవేన్స్ సెప్టెంబర్ నెలలో పెరగబోతోంది. ఈసారి డీఏ మూడు శాతం పెరగబోతున్నట్లు తెలుస్తోంది. జూలై నుంచి ఎరియర్లతో పాటుగా అందబోతోంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది జనవరి జూలై నెలలో పెంపు ఉంటుంది. జనవరిలో డీఏ పెంపు నాలుగు శాతం పెరగడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది.
అయితే ఇప్పుడు జూలై డీఏ పెంపు సెప్టెంబర్ నుంచి అమలు కాబోతోంది. రెండు కలిపి మూడు శాతం ఉండొచ్చు అని తెలుస్తోంది. మొత్తం డీఏ సెప్టెంబర్ నెల నుంచి 53 శాతానికి చేరుకోబోతోంది. డీఏ పెంపు మార్చి 7న జరిగింది. జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది.
మూడు నెలల ఎరియర్లతో పాటుగా ఉద్యోగులకు, పెన్షనర్లకు డబ్బులు అందాయి. జూలై నుంచి అమలు కావాల్సిన డీఏ పెంపు సెప్టెంబర్ లో ఉండొచ్చని తెలుస్తోంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది. ఈ సంఘం 2014లో ఏర్పడిన విషయం తెలిసిందే కొత్త వేతన సంఘం ఏర్పాటు కావాలి 2014లో ఏర్పాటైన ఏడవ వేతన సంఘం 2016 నుంచి అమల్లోకి రావడం జరిగింది.