సేవింగ్ అకౌంట్స్ పై ఏ బ్యాంకులు అధిక వడ్డీని ఇస్తున్నాయో తెలుసా?

-

ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు సేవింగ్ అకౌంట్స్ పై మంచి వడ్డీని ఇస్తున్నాయి..ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి..కొన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సమానమైన వడ్డీని ఇచ్చే అనేక బ్యాంకులు ఉన్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే పొదుపు ఖాతాలపై సీనియర్ సిటిజన్‌లకు అయితే అధిక వడ్డీ ఆప్షన్‌ లేదు..ఆర్బీఐ రేఫో రేటును పెంచిన తర్వాత..చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీని పెంచాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకులు అందిస్తున్న ప్రస్తుత పొదుపు ఖాతా వడ్డీల గురించి తెలుసుకోండి..

 

ఎస్‌బీఐ :

ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐ రూ.10 కోట్ల వరకు డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీని, సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పొదుపు ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే అంతకు మించిన డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది.

కెనరా బ్యాంక్:

ఇక కెనరా బ్యాంక్ వివిధ మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద గరిష్టంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్:

ఈ బ్యాంకులో రూ. 50 లక్షల వరకు ఉన్న డిపాజిట్ల మీద 3% వడ్డీ అందుతుంది. అదే సమయంలో, రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీ అందుతుంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల వరకు విలువైన డిపాజిట్ల మీద 2.70 శాతం వడ్డీని అందిస్తోంది. రూ. 10 లక్షల కంటే పైబడి విలువున్న డిపాజిట్ల మీద 2.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇదే సమయంలో, 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.

యూనియన్ బ్యాంక్:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షల డిపాజిట్ల మీద 2.75 శాతం, రూ. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకు డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.10 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 500 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్ల మీద వార్షిక వడ్డీగా 3.40 శాతం చెల్లిస్తోంది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద అత్యధికం.. ఈ బ్యాంకులు అన్నీ కూడా పొదుపు ఖాతాలపై మంచి వడ్డీని ఇస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version