మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

-

జీఎస్టీ వసూళ్లలో మరోసారి భారత్ రికార్డు సృష్టించింది. వరుసగా ఆరో నెలలోనూ వస్తు, సేవల పన్ను వసూళ్లు రికార్డు సృష్టించడం హర్షనీయమని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. వస్తు, సేవల పన్ను వసూళ్లు వరుసగా ఆరో నెలలోనూ రూ.1.40 లక్షల కోట్లు దాటాయని తెలిపింది. ఆగస్టు నెలలో 28 శాతం పెరిగిన పన్ను వసూళ్లు.. రూ.1.43 లక్షల కోట్లు ఖజానాకు జమ అయినట్లు.. కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

“ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. అందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 24,710 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,951 కోట్లుగా ఉంది. సమీకృత జీఎస్టీ రూ.77,782 కోట్లు, సెస్‌ రూ.10,168 కోట్లు వసూలు అయ్యాయి” అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఆగస్టులో 28 శాతం అధికంగా వసూలైనట్లు వివరించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జీఎస్టీ రాబడులపై ప్రభావం చూపినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version