ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్‌ ఉన్నాయా..? జాగ్రత్త

-

ఈ రోజుల్లో సింగిల్‌ సిమ్‌, సింగిల్‌ అకౌంట్‌ వాడేవారి సంఖ్య చాలా తక్కువ. మన అవసరాలకు తగ్గట్టుగా ఇలా చేస్తుంటాం. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్‌ ఓపెన్‌ చేయడం పెద్ద పనేం కాదు.వాటిని మేనేజ్‌ చేయడం కూడా అంత కష్టమైన పని కాదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటి, వీటిని ఎలా మేనేజ్ చేయాలి? వంటి విషయాలు తెలుసుకుందామా..!

బ్యాంకు అకౌంట్స్‌

ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ రంగం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని బ్యాంకులు కస్టమర్లకు హైటెక్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో వీడియో KYC బాగా పాపులర్ అయింది. ఈ ఫీచర్ ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ అకౌంట్స్ తెరిచే సదుపాయాన్ని అందిస్తోంది. కాబట్టి ప్రజలు వివిధ బ్యాంకుల్లో మల్టిపుల్ సేవింగ్స్ అకౌంట్స్ సింపుల్‌గా ఓపెన్ చేస్తున్నారు. ఒకటికంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయడం సులభమే కానీ వాటిని మేనేజ్ చేయడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.

ప్రతీ సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్ నెలనెలా మెయింటైన్ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించుకోక తప్పదు. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే, ప్రతి అకౌంట్ బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది. ఫలితంగా చాలా సార్లు పెనాల్టీలు ఎదుర్కొనే రిస్క్ ఉంటుంది.

డిజిటల్ ట్రాన్సాక్షన్ల పెరుగుదలతో ఆన్‌లైన్ మోసాలు, స్కామ్‌లు కూడా బాగా పెరిగాయి. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే, ప్రతి ఖాతాలోని మోసాలు గుర్తించాలి. ఇది ఇంకోపని. అందుకే, ముందు జాగ్రత్తగా అకౌంట్స్‌కు స్ట్రాంగ్ సెక్యూరిటీని అందించాలి. అన్ని అకౌంట్స్‌కి ఒకే పాస్‌వర్డ్ సెట్ చేయకూడదు.

కొన్ని అకౌంట్స్ ఎక్కువ కాలం వాడకపోతే వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ అవుతాయి. ఇన్‌యాక్టివ్‌ అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేయడం కోసం ఎక్స్‌ట్రా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అన్ని అకౌంట్స్ నుంచి క్రమం తప్పకుండా చిన్నపాటి లావాదేవీలు చేయడం వల్ల డియాక్టివేషన్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇది కూడా సాధారణ ప్రజలకు అనవసరమే.

కొన్ని బ్యాంకింగ్ సేవలు ఫ్రీ అయితే, మరికొన్ని ఎక్స్‌ట్రా ఫీజులు వేస్తాయి. ఆ ఛార్జీల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే అవి కాలక్రమేణా కస్టమర్ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అకౌంట్ విషయంలో బ్యాంకు విధించే ఫీజుల గురించి ముందే తెలుసుకోవాలి.

బ్యాలెన్స్‌లను క్రమం తప్పకుండా ట్రాక్ చేయడానికి బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించాలి. ట్రాన్సక్షన్లు, గడువు తేదీల కోసం ఆటోమేటిక్ నోటిఫికేషన్లను సెటప్ చేసుకోవాలి. మోసాల బారిన పడకుండా బలమైన సెక్యూరిటీ సర్వీసెస్‌ రన్ చేయాలి. రెండు నుంచి మూడు బ్యాంక్ అకౌంట్స్ మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది, కానీ అంతకు మించిన సంఖ్యలో ఖాతాలు మేనేజ్ చేయడమే కాస్త కష్టం. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాతే వాటిని మెయింటైన్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version