హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం… రెండు కొత్త క్రెడిట్ కార్డులు..!

-

క్రెడిట్ కార్డుని మీరు పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తో పాటు పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

hdfc-bank

ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తో ఈక్విటస్ కస్టమర్లకు సులభంగానే క్రెడిట్ కార్డులు పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మార్పు చేయడం వలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు పెరిగినట్లు అవుతుంది.

దీనితో రెండు బ్యాంకుల కస్టమర్స్ కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని తెలుస్తోంది. అదే విధంగా ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ప్రధానంగా 2 కేటగిరిల్లో లభించనున్నాయి. ఒకటి ఎక్సైట్ క్రెడిట్ కార్డు. మరొకటి ఎలిగెన్స్ క్రెడిట్. ఇలా ఇవి రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. అయితే ఎక్సైట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షల వరకు ఉంటుంది. అదే ఎలిగెన్స్ క్రెడిట్ కార్డు అయితే లిమిట్ రూ.2 లక్షలకు పైన ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version