స‌రూర్ న‌గ‌ర్ బీసీ హాస్ట‌ల్ 15మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌..!

-

సరూర్ నగర్ బీసీ హాస్టల్ లో మంచి నీరు మరియు ఫుడ్ పాయిజన్ తో 15 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ముందస్తుగా విద్యార్థులను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆ తర్వాత నీలోఫర్ కి తరలించిన హాస్టల్ సిబ్బంది త‌ర‌లించారు. విద్యార్థుల‌ను ఉస్మానియా ఆస్ప‌త్రి నుండి 108 సహాయంతో హైదరాబాద్ నాంపల్లి లోని నిలోఫర్ కి తరలించారు. గత నాలుగు రోజులుగా హాస్టల్ లో తాగడానికి మంచినీరు లేక అనేక విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

food poison saroornagar bc hostel

అయితే ఈ విష‌య‌మై విద్యార్థులు అనేక సార్లు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. హాస్టల్ వార్డెన్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే ఇలా జ‌రిగింద‌ని విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ ఘ‌ట‌న పై విద్యార్థుల త‌ల్లితండ్రులు కూడా సీరియ‌స్ అవుతున్నారు. హాస్ట‌ల్ వార్డెన్ ను స‌స్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version