స్టేట్ బ్యాంక్ అదిరే ఆఫర్.. 5 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు..!

-

చాలా మందికి సొంతింటి కలని నెరవేర్చుకోవాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా సొంతింటి కలని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సులభంగానే రుణం పొందే అవకాశం అందుబాటులో ఉంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అర్హత కలిగిన కస్టమర్లకు ఈజీగా లోన్స్ ఇస్తోంది.

పైగా పలు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం కూడా మనం పొందొచ్చు. కేవలం 5 రోజుల్లో రుణ మంజూరు ఉంటుందని బ్యాంక్ అంది. అదే విధంగా ఆకర్షణీయ వడ్డీ రేటుకే టాప్ అప్ ని కూడా పొందొచ్చు.

క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన రుణ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. మీరు కనుక స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ ని పొందాలంటే ఎస్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు పొందొచ్చు లేదా మీరు 1800 11 2018 నెంబర్‌కు కాల్ చేసి అవసరమైన సమాచారం పొందొచ్చు.

లేదంటే 07208933140 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు కూడా. అప్పుడు బ్యాంక్ అధికారులు మీకు రిటర్న్ కాల్ చేసి హోమ్ లోన్ పూర్తి వివరాలు, దరఖాస్తు వంటి వాటిని చెబుతారు. వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.7 శాతం నుంచి మొదలవుతోంది. హోమ్ లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉండటం వల్ల వడ్డీ భారం కూడా అధికంగా ఉంటుంది. అందుకే వడ్డీ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే లోన్ తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version