స్విస్ బ్యాంక్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు పెంపు

-

స్విస్ నేషనల్ బ్యాంక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను భారీగా పెంచింది. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో -0.25శాతంగా ఉన్న వడ్డీ రేటును.. ఏకంగా 0.5శాతంగా మార్చింది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది స్విస్ నేషనల్ బ్యాంక్.

అంతకుముందు.. అమెరికన్ ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్లు ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడ వడ్డీరేట్లు 3.25 శాతానికి చేరాయి. ఈ సందర్భంగా పావెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ఆర్థికమాంద్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version