SBI ఖాతాదారులకు హెచ్చరిక..లిమిట్స్ దాటితే బాదుడే..!

-

భారత దేశ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 40 కోట్లకు పైగా ఖాతా దారులు ఉన్నారు.ఇక దేశం మొత్తంగా కలిపి 22 వేలకు పైగా ఎస్‌బీఐ బ్రాంచులు ఉన్నాయి. నిత్యం కోట్లాది మంది కస్టమర్లు ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారు..అయితే ఈ మధ్య కొన్ని రూల్స్ మారాయి. ఇప్పుడు ఖాతా దారులకు మరో అలర్ట్ న్యూస్ ను అందించింది.ఇటీవల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ లిమిట్ మార్చింది ఎస్‌బీఐ. కార్డును బట్టి విత్‌డ్రా లిమిట్ మారుతుంది. అన్ని ఎస్‌బీఐ డెబిట్ కార్డులకు విత్‌డ్రా లిమిట్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ వేర్వేరు రకాల డెబిట్ కార్డులను కస్టమర్లకు ఇస్తుందన్న సంగతి తెలిసిందే.

ఇక, ఎస్‌బీఐ డెబిట్ కార్డు కలిగిన వారు చార్జీలు లేకుండా నెలకు ఎన్ని సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చొ ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఎటువంటి చార్జీలు లేకుండా నెలలో ఐదు సార్లు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి మెట్రో నగరాల్లో మూడు సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు చార్జీలు లేకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు.ఎస్‌బీఐ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే రూ. 5 నుంచి రూ. 20 వరకు చార్జీ వసూలు చేస్తుంది. ఏటీఎం ద్వారా మీరు నిర్వహించే ట్రాన్సాక్షన్ ప్రాతిపదికన మీ చార్జీలు కూడా మారతాయి. ఉచిత లిమిట్ తర్వాత ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే రూ. 10 చార్జీ పడుతుంది.

అదే విధంగా ఇతర బ్యాంక్‌ ఏటీఎం ల నుంచి విత్ డ్రా చేస్తే 20 రూపాయలు చెల్లించాలి.ఏటీఎంలో ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే రూ. 5, ఇతర ఏటీఎంలలో లావాదేవీలు చేస్తే రూ. 8 చార్జీ పడుతుంది.అలాగే నెల బ్యాలెన్స్ రూ. లక్షకు పైన మెయింటెన్ చేసే వారికి అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ల బెనిఫిట్ లభిస్తోంది. ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా నిర్వహించే ట్రాన్సాక్షన్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఏటీఎంలలో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు జరిపితే.. బ్యాంక్ రూ. 100 చార్జీ వసూలు చేస్తుంది.ట్రాన్సాక్షన్ మొత్తంలో 3.5 శాతం చెల్లించాలి. పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే లావాదేవీ మొత్తంలో 3 శాతం చార్జీగా చెల్లించుకోవాలి.అదే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తే.. అప్పుడు రూ. 20 చార్జీ పడుతుంది..అంటే అకౌంట్ మైనస్ లో పడుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version