ఎప్పటి నుండో సీనియర్ సిటిజెన్స్ కి మంచి ఆఫర్స్ ని బ్యాంకులు ఇస్తున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను సీనియర్ సిటిజన్‌ల కోసం తీసుకు వచ్చాయి. దీనితో సీనియర్ సిటిజెన్స్ కి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
సీనియర్ సిటిజెన్ల కోసం ఈ పధకం తీసుకు వచ్చారు. కానీ ఈ ప్రత్యేక అవకాశాన్ని పరిమిత సమయం వరకు మాత్రమే పొందడానికి అవకాశం వుంది. ఇది సెప్టెంబర్ 30, 2021 న ముగుస్తుంది. ఇక ఈ పధకం వలన కలిగే బెనిఫిట్స్ చూస్తే… స్టేట్ బ్యాంక్ ఈ ప్రత్యేక పథకం కింద సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. అదే హెచ్డీఎఫ్సి బ్యాంక్ లో అయితే 7.25 శాతం వడ్డీ పొందుతారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ సిటిజన్స్ కు (5 నుండి 10 సంవత్సరాలు) వడ్డీ రేటు 6.25%. ICICI ప్రత్యేక ఎఫ్‌డి పథకంలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు సాధారణ కస్టమర్ల కంటే 0.60 శాతం ఎక్కువ. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 6.30 శాతం. ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్‌లకు ఈ ప్రత్యేక అవకాశం మే 2020 లో మొదట ప్రకటించబడింది.
అయితే సీనియర్ సిటిజన్స్ 5 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మొదట 30 సెప్టెంబర్ 2020 వరకు గడువును పొడిగించారు. తరువాత 31 డిసెంబర్ 2020 వరకు పొడిగించారు. ఇలా చివరిగా 30 సెప్టెంబర్ 2021 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది.