క‌రోనా అప్డేట్..దేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా..!

-

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుముకం ప‌డుతోంది. నిన్న దేశంలో న‌ల‌బైవేల‌కు పైగా కేసులు న‌మోదుకాగా ఈ రోజు కూడా మ‌ళ్లీ కేసులు న‌ల‌భైవేలు దాటాయి. తాజాగా దేశంలో గ‌డిచిన 24గంట‌ల్లో 46,759 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంతే కాకుండా క‌రోనా నుండి 31,374 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారికి 509 మంది బ‌ల‌య్యారు. ఇక తాజాగా దేశంలో న‌మోదైన కేసులతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో మొత్తం 3,26,49,947 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

3,18,52,802 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో క‌రోనాతో మొత్తం దేశ వ్యాప్తంగా 4,37,370 మంది మ‌ర‌ణించారు. ఇక క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇంకా క‌రోనా సెకండ్ వేవ్ పూర్తిగా పోలేద‌ని ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ లో మ‌ధ్య ద‌శ‌లో ఉన్నామ‌ని హెచ్చ‌రించింది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version