చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడం పై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్నహామీలు తోసిపుచ్చారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు.
మరోవైపు క్యాంపస్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. నిజామాబాద్- బైంసా రూట్లలో పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. కళాశాల మెస్ లలో భోజనం సరిగా ఉండటం లేదని, విద్యుత్ సమస్య, నీటి సమస్య తీవ్రంగా వెంటాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.