పెళ్లైన నెలన్నరకే అత్తింటివారికి షాకిచ్చిన నవవధువు..

-

కొన్ని కొన్ని సార్లు అనుకొని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒక్కింత ఆశ్చర్యానికి లోనవుతుంటాము. అయితే ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న నెలన్నరకే తన భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో లబోదిబోమన్నాడు. ఆమెకు నెలన్నర క్రితమే పెండ్లి అయింది. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో అత్తింటివారు అవాక్కైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని మహారాజ్‌కు చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతితో నెలన్నర క్రితం వివాహం అయింది. పెండ్లితంతు ముగియడంతో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఆ యువకుడికి పిడుగులాంటి వార్త తెలిసింది.

ఓరోజు ఆ నవవధువు తనకు కడుపు నొప్పిగా ఉందని భర్త, అత్తా మామలకు తెలిపింది. దీంతో వారు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. పెండ్లయి నెలన్నరే అవుతుంటే నాలుగు నెలల గర్భం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవడంతో వారి వంతయింది. తాము మోసపోయామని గ్రహించిన భర్త, అత్తమామలు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. అమ్మాయి తల్లిదండ్రులు తమను మోసం చేశారని, గర్భం గురించి ముందే తెలిసినప్పటికీ.. వివాహం జరిపించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version