గత రెండేళ్ల నుంచి భారత క్రికెటర్లు అందురు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య… బయో బబుల్. దేశావాళీ టోర్నీలు అయినా.. అంతర్జాతీయ సిరీస్ లు అయినా.. ఆడే ముందు ఆటగాళ్లు కఠినమైన బయో బబుల్ ను ఎదుర్కొవాల్సి వస్తుంది. దీంతో ఆటగాళ్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. అది ఆటపై కూడా ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మరి వచ్చిన నాటి నుంచి బయో బబుల్ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం కూడా ఈ బయో బబుల్ నిబంధన ఉంది.
అయితే తాజా గా బీసీసీఐ బయో బబుల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బయో బబుల్ నుంచి ఆటగాళ్లు విముక్తి కలిగించేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆటగాళ్లుకు ఇబ్బందిగా ఉన్న బయో బబుల్ నిబంధనను ఎత్తివేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నెల నుంచే బయో బబుల్ నిబంధనను ఎత్తివేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే ప్రస్తుతం బయో బబుల్ ను నిబంధనను దేశవాళీ ఆటగాళ్లకు మాత్రమే ఎత్తివేయనున్నటు తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత టీమిండియా ఆటగాళ్లకు కూడా బయో బబుల్ నిబంధనలు ఎత్తివేయాలి బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.