కేటీఆర్ నోరు జారితే జాగ్రత్త : బీర్ల ఐలయ్య హెచ్చరిక

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు కట్టబెట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు.

అధికారం పోయిందనే అక్కసుతో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇప్పుడైనా కేటీఆర్ తన బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. మీరు చేసిన అప్పులను, తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ సీఎం రేవంత్ ప్రజాపాలన అందిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్నీ ఛీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా, జైలుకు వెళ్తూ వెళ్తూ సీఎంపై నోరు జారితే జాగ్రత్త అని హెచ్చరికలు పంపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news