‘బీస్ట్’ ప్రమోషన్స్ షురూ..ఇళయ దళపతి విజయ్ ఇక్కడికి వచ్చేనా..

-

ఇళయ దళపతి విజయ్ హీరో గా తెరకెక్కిన ‘బీస్ట్’ ఫిల్మ్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, అది చూసి విజయ్ అభిమానులు ఆనందపడిపోయారు. పాన్ ఇండియా రిలీజ్ గా వస్తున్న ఈ సినిమా విజయ్ స్టార్ డమ్ ను ఇంకా పెంచే చిత్రమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ‘బీస్ట్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. సన్ టీవీలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ హీరో విజయ్ ను ఇంటర్వ్యూ చేస్తు్న్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది తెగ వైరలవుతోంది.

‘బీస్ట్’ సినిమా విశేషాలతో పాటు హీరోగా తన ఎక్స్ పీరియెన్స్ ఇతర విషయాలను ఇంటర్వ్యూలో ఇళయ దళపతి పంచుకున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పైన మూవీ యూనిట్ కాన్సంట్రేట్ చేస్తుందా? లేదా? అనేది క్వశ్చన్ గా ఉంది.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రాజమౌళి దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ ప్రమోట్ చేశారు. ఆయన మాదిరిగా ప్రమోషన్స్ చేస్తేనే సినిమా డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ కు రీచ్ అవుతుందని సినీ పరిశీలకులు ఈ సందర్భంగా చెప్తున్నారు కూడా. అయితే, ఇళయ దళపతి విజయ్ ‘బీస్ట్’ ప్రమోషన్స్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వస్తాడా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది.

తెలుగునాట కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విశాల్ లకు మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే వారు తమ చిత్రం విడుదలయినపుడు వచ్చి ఇక్కడ ప్రమోట్ కూడా చేస్తుంటారు. విజయ్ కూడా వచ్చాడు. ‘తుపాకీ’ చిత్ర ప్రమోషన్స్ కు వచ్చాడు. కానీ, ఆ తర్వాత రాలేదు. అయితే, ఆయన రానప్పటికీ ‘మాస్టర్’ చిత్రాన్ని తెలుగునాట బాగా ఆదరించారు.

ఈ క్రమంలోనే ‘బీస్ట్’ ఫిల్మ్ ప్రమోషన్స్ తెలుగులో చేస్తాడా? అని నెటిజన్లు, విజయ్‌కు ఉన్న తెలుగు అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ కేవలం తన మాతృభాష అయిన తమిళ్ లో మాత్రమే ‘బీస్ట్’ ను ప్రమోట్ చేస్తాడా? మిగతా భాషల్లో ప్రమోట్ చేయబోరా? అని అనుకుంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version