అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా!

-

అందం అనగానే అమ్మాయిలే గుర్తుకువస్తారు. ఏం అబ్బాయిలు అందంగా ఉండకూడదా? అందం మహిళలకే సొంతమా? ఏ పత్రికలు, వీడియోలు చూసినా అమ్మాయిలు మాత్రమే అందం విషయంలో చిట్కాలు ఉంటాయి. అబ్బాయిల గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. మరేం బెంగపడవద్దు. అబ్బాయిలు అందం విషయంలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో ఈ కింది చిట్కాలు చదవండి.

నిమ్మ మరియు తేనె : నిమ్మరసంలో దుమ్ము ధూలిని వదిలించి శుద్ది చేసే గుణం కలిగుంటుంది. ఇంట్లో ఫేస్‌వాస్‌కు బదులుగా నిమ్మరసం ఉపయోగించడం మంచిది. తేనె, నిమ్మరసాన్ని బాగా కలుపాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే ముఖం అందంగా మారుతుంది.
తేనె మరియు కాఫీ : తేనె, కాఫీపొడి, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ తీసుకొని బాగా కలుపాలి. ఈ పదార్థాలను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే చర్మంపై చనిపోయిన చర్మకణాలను తొలిగిస్తుంది. దీంతో చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది.

బాదం, గంధం మరియు వేప : వేపాకు తీసుకువచ్చి పేస్ట్‌ చేయాలి. అందులో గంధపు పొడి, బాదం పొడి, పసుపు పొడి వేసి బాగా కలుపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ఐప్లె చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ముఖం ప్రకాశవంతంగా తాజాగా కనిపిస్తుంది.

ఆరెంజ్‌ జ్యూస్‌ మరియు పసుపు పేస్ట్‌ : ఆరెంజ్‌లో పుష్కలమైన విటమిన్లు అందుబాటులో ఉంటాయి. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. నారింజ రసంలో చిటికెడు పసుపు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతి క్రమం తప్పకుండా పాటించాలి.
బొప్పాయి మాస్క్‌ : బొప్పాయి శరీరానికి వేడి చేసే పదార్థం. అయినప్పటి ప్రొటీన్లు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ బొప్పాయి చర్మానికి మేలు చేస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడానికి సహాయపడే ఎంజైమ్‌ అయిన పాపైన్‌ ఎక్కువ ఉంటుంది. బొప్పాయి పేస్ట్‌తో ముఖం మృదువుగా తయారవుతుంది.
– ఇలా ఆలుగడ్డలు, టమాటాలు, ఓట్స్‌ అన్నింటితో విడివిడా ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దేన్నైనా ఒకదాన్ని ఫాలో అయితే మంచిది.

– ముఖం సబ్బుతో కడుక్కునేదానికంటే ఫేస్‌స్క్రబ్‌లు వాడడం మంచిది. దీనివల్ల చర్మంలో డెడ్‌స్కిన్‌ తొలిగిపోతాయి. పురుషులు వాడేందుకు లెక్కలేనన్ని స్క్రబ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సాలిసిలిక్‌ ఆమ్లం, ఫ్రూట్‌ ఎంజైమ్‌లు, సిట్రిక్‌ యాసిడ్‌ మరియు ైగ్లెకోలిక్‌ ఆమ్లం కలిగిన స్క్రబ్‌లను ఎంచుకుంటే మంచిది.
– ఎన్ని మాస్క్‌లు, స్క్రబ్‌లు వాడినా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఏవీ పనికిరావు. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ఎల్లప్పుడూ నవ్వుతూ పక్కవారిని నవ్విస్తూ ఉండండి. టెన్షన్‌ నుంచి బయటపడడంతో ముఖం కాంతివంతంగా మారతుంది.
– చర్మం వీలైనంత వరకు తేమగా ఉండేలా చూసుకోండి. అంటే డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. చర్మాన్ని మాయిశ్చరైజర్‌తో మసాజ్‌ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ తీసుకొని చర్మంపై రుద్దడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇలా కాకపోయిన టవల్‌పై ఐస్‌క్యూబ్స్‌ ఉంచి నిద్రకు 15 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version