సముద్రం దగ్గర ప్రేమ
ఇసుక తీరాల్లో ప్రేమ
ఉప్పుటేరు గాలుల్లో ప్రేమ
అంతా ఒప్పుకోలు
అంతా మెరమెచ్చుకోలు
అయినా కూడా దేహపు లోగిళ్లలో
ఇమడలేనంత సంతోషం
సాయంత్ర కాల విశేషం
ప్రేమ విరుద్ధం అయ్యాక
సంబంధిత విశేషం స్వానుభవం అవుతుందా?
తిక్క ప్రశ్న.,. కనుక ప్రశ్నే డేంజరస్.
ప్రేమను నిర్వచించే క్రమంలో అమ్మాయిలు అరంగుళం కూడా తగ్గనివ్వరు. ఆరడుగుల ఆజానుబాహుడే తమవాడు అని అంటారు. ప్రేమకు ఆకర్షించే గుణం ఎంతో దూరం పెట్టే అవలక్షణం కూడా అంతే ఉంది! ఈ విధంగా చెప్పుకుంటే ఎంతో ఉంది. అందమమయిన అమ్మాయిలు సముద్ర తీరాన వారి పాద ముద్రలు కొన్ని దశాబ్దాలుగా మారుతూ ఉన్నాయి. కానీ ప్రేమ సంబంధ చర్యలు అన్నీ తరువాత అవి విరహాలకు కారణం అవుతున్నాయి. దేహ సంబంధ చర్యలు కొన్ని కారణాల రీత్యా అత్యంత స్వల్ప కాలిక బంధాలుగా ఉంటున్నాయి.
ప్రేమ ఎవరికైనా ప్రేమే అని చెప్పడం అబద్ధం. మనుషులు జడివానలను ప్రేమించడం అర్థం చేసుకోవడం మొదలుపెడితే ఈ వాన నీటి తుంపరులు, పెదవి తాకిడి వెంట పుట్టే ఘర్షణలు, దేహ సంబంధ కలహాలు వీటన్నింటినీ సమానంగా స్వీకరించగలరు. ప్రేమ అనే ఓ పెద్ద విధ్వంసం నుంచి అందమయిన అమ్మాయిలు బయట పడేయలేరు మగాళ్లను! కేవలం వాళ్లు లోతు తెలియని అగాధాలు.. వారి వెంట నడవడంలో డేంజర్ ఉంది. ప్రమాదాలను నివారించే శక్తి ఆ కళ్లకు లేదు. ఆ దేహాలకు లేదు. మగాళ్ల తాపత్రయాలను నిలువరించే శక్తి ఒక్కటే వారి ప్రేమకు ఉంది అని అనుకోవడం కూడా భ్రమే! మాటల కారణంగా అందమయిన అమ్మాయిలు ప్రమాదాలను వెంట ఇచ్చి వెళ్తారు. మౌనం కారణంగా కొన్ని ఇష్టాలు పెరిగి అవి కూడా కొన్ని విధ్వంసాలకు కారణం అవుతాయి. కనుక మాట కన్నా మౌనం ప్రమాదం. అమ్మాయి మౌనం అమ్మాయి అందం అన్నీ అన్నీ కూడా అవధి దాటితే అత్యంత ప్రమాదం.
అమ్మాయిలు ఎవ్వరయినా డేంజరస్. ఆ విధంగా మంచి చెడు రెండూ డేంజరెస్. మంచిలో కూడా చెడు వెతికే వ్యక్తులే డేంజరస్. చెడు చేశాక కూడా తామంతా మంచి వాళ్లమే అని భ్రమింపజేసే వాళ్లు ఇంకా డేంజరస్. ఏదేమయినా అందమయిన అమ్మాయిలు ప్రమాదకారులు. ప్రమాదాలను విచ్ఛిన్నం చేసే శక్తి అయితే వారిలో లేదు. కేవలం కొన్ని యుద్ధాలకు కారణం అవుతారు.లేదా కొన్ని అంతః కలహాలకు కారణం అవుతారు. అందుకే ప్రేమ ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమే అని ఆర్జీవీ అంటున్నారు. కానీ కలహం కూడా ఏ ఇద్దరి మధ్య అయినా కలహం అయి ఉంటుంది కానీ ప్రేమ కాదు. ప్రేమ పూర్వక కలహాలకు అర్థాలే వేరు.
శ్రీకాకుళం దారుల నుంచి