బ్యూటీ స్పీక్స్ : అందాల న‌ది న‌దియా !

-

అత్తారింటికి దారేది అని అనుకోగానే ఒక అత్త వ‌చ్చి క‌ళ్లెదుట నిల‌బ‌డి ధీరోదాత్తంగా మాట్లాడి వెళ్లింది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలనిపించే అందంతో క‌ట్టిప‌డేసింది. అస‌లు హీరోయిన్ అనుష్క క‌న్నా గొప్ప‌గా క‌నిపించింది మ‌రో సినిమాలో.. మిర్చిలాంటి కుర్రాడికి త‌ల్లి పాత్ర..అయినా కూడా ఆమె అందం ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అభినయం క‌ట్టిప‌డేసింది.

ఆవిధంగా ఆమె మ‌రోసారి తెర‌పై త‌ళుక్కుమ‌ని, మ‌రోసారి త‌న ఇమేజ్ ను మ‌రింత రెట్టింపు చేసుకోవ‌డంతో టాలీవుడ్ కు అంద‌మ‌యిన అత్త దొరికారు. అణ‌కువ అయిన‌, ఆత్మ విశ్వాసం నిండిన అమ్మ దొరికారు. ఆమెనే అందాల న‌ది న‌దియా… ఇంకా చెప్పుకోవాంటే…దృశ్యంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర క‌ళ్లెదుటకు వ‌స్తుంది. అంత‌టి సిన్సియార్టీ ఆమెలోనూ ఉంది. సీనియారిటీ మాత్ర‌మే కాదు..సిన్సియార్టీ కూడా ! ఏ విధంగా చూసుకున్నా న‌దియా లాంటి వారు మాయ చేస్తారు.

ఆ మాట‌కు వ‌స్తే అమ్మాయిలు అంతా ఎట్రాక్టివ్ పాయింట్స్. ఇంకా చెప్పాలంటే వాళ్లే ప్ర‌ధానం ఈ ప్ర‌పంచానికి. మ‌గువ లేనిదే మ‌గ‌డు లేడు. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ  అమ్మాయిల‌ను గ్లోరిఫై చేసి చూపిస్తుంది క‌నుక మ‌న‌కు న‌దియా అయినా న‌గ్మా అయినా ఎప్ప‌టికీ క‌ల‌ల రాణులే! వారి గురించి చెప్పే ముందు ఇంకొన్ని సంగ‌తులు కూడా జోడించాలి. అమ్మాయిల బ్యూటీ సెన్స్ గురించి, పెద‌వుల‌కు పూసే రంగుల గురించి, క‌ళ్ల‌కు దిద్దే కాటుక గురించి ఇంకా ఎన్నో క‌లిస్తేనే బ్యూటీ స్పీక్స్ ఎలాట్ అని డీకోడ్ చేయొచ్చు. లేదా డిఫైన్ చేయొచ్చు.

ఎన్ని చెప్పండి.. న‌దియాకు మాత్ర‌మే కాదు అందం అమ్మాయిల సొంతం. ఆస్తి అని కూడా రాయాలి. అంటే అందం అమ్మాయి సొంత ఆస్తి. కాలం క‌రిగే కొద్ది ఆస్తిలో త‌గ్గుదల వ‌స్తూ ఉంటుంది. మ‌రి! స్థిర‌మయిన భావాలు మాత్రం అలానే ఉండాలి. అమ్మాయిలు ఎవ్వ‌రైనా స‌రే అందంగా ఉంటే పొగ‌డ్త‌ల‌కు తూగుతారు. అందంగా ఉంటే కుర్ర‌కారు వెంట ప‌డ‌తారు. అందంగా ఉంటే వీలున్నంత మేర‌కు ల‌వ్  లెట‌ర్లు కూడా రాస్తారు. అయినా అందం అన్న‌ది ఒక క్వాలిఫికేష‌న్ అమ్మాయి. అది వ‌ద్ద‌నుకోవ‌డం ఆడ‌వారికి సాధ్యం కాని ప‌ని. అంద‌మ‌యిన అమ్మాయిలంతా కొద్దిగా కాదు కాస్త ఎక్కువ‌గానే తెర‌పై త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉంటారు. ఇప్ప‌టికీ ఉంటున్నారు.

ఒక‌ప్పుడు గ్లామ‌ర్ ప్ర‌పంచం అంటే ఏహ్య భావం ఉన్న వారంతా ఇవ‌న్నీ చదివితే ఏమ‌యిపోతారో! ఇప్పుడు తెర‌ముందుకు రావ‌డం సులువు. సోష‌ల్ మీడియా పుణ్య‌మాని ఎవరికి వారే హీరోయిన్లు. ఎవ‌రంత‌ట వారే హీరోలు కూడా! క‌నుక అందం ఉన్న ప్ర‌తి అమ్మాయి న‌ట‌నలో ప్ర‌తిభ ఉండాల‌ని రూలేం లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఐశ్వ‌ర్య రాయ్ కెరియ‌ర్ తొలిరోజుల్లో ఏ పాటి అభిన‌యం ప్ర‌ద‌ర్శించిందో తెలిసిందే క‌దా! క‌నుక అందం మ‌రియు అభినయం రెండూ సొంత ఆస్తులుగా ఉన్న‌వాళ్లే ఈ రంగంలో రాణిస్తారు లేదంటే ఇంటికే ప‌రిమితం అవుతారు. కానీ న‌దియా లాంటి ఆర్టిస్టులు ఎవ‌ర్ గ్రీన్.. ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు.

 

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version